ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని ఫ్యాన్ ని అంటోన్న నాయిక!

Sat, Jun 18, 2016
నివేదా థామస్
నివేదా థామస్
నాని కథానాయకుడిగా నటించిన 'జెంటిల్ మన్' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన సరసన సురభి .. నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో తన పాత్రకి లభిస్తోన్న రెస్పాన్స్ పట్ల నివేదా థామస్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకి తమిళ .. మలయాళ సినిమాల్లో నటించిన అనుభవం ఉందనీ, అనుకోకుండా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యానని చెప్పింది.

తనకి తెలుగు బాగానే తెలుసనీ .. అయితే తాను ఇంత బాగా నటించడానికి నాని కారకుడని అంది. ఆయన అందించిన సహాయ సహకారాలను మరిచిపోలేనని చెప్పింది. నాని నటన అంటే తనకి చాలా ఇష్టమనీ .. ఆయన సినిమాలు చూశానని అంది. కమలహాసన్ తరువాత తాను అభిమానించే నటుడు నాని అనీ, అవకాశం వస్తే ఆయనతో మళ్లీ నటించాలని వుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)