ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పంచ్ డైలాగ్ తో వచ్చిన 'జక్కన్న'

Sat, Jun 18, 2016
సహజంగానే సునీల్ సినిమాల్లో పంచ్ డైలాగ్స్ ఎక్కువగా వుంటాయి. తనదైన టైమింగ్ లో ఆయన పేల్చే పంచ్ లు ఆడియన్స్ ను ఆద్యంతం ఆకట్టుకుంటూ వుంటాయి. అలాంటి పంచ్ లను సునీల్ ఈసారి 'జక్కన్న' టీజర్ నుంచే మొదలు పెట్టేసి ఆకట్టుకుంటున్నాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సునీల్ - మన్నారా చోప్రా జంటగా నటించారు.

ఈ సినిమా నుంచి ఈ రోజున టీజర్ ను వదిలారు. సునీల్ మార్క్ కామెడీ .. డాన్స్ .. యాక్షన్ ఈ టీజర్ లో ఉండేలా చూసుకున్నారు. టీజర్ ఆసక్తికరంగా .. ఆకట్టుకునేలా .. అంచనాలు పెంచేదిగానే వుంది. సప్తగిరి మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్ ఇస్తూ ... '' నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా? '' అని అడగ్గా, ''నీకు గీతా ఆర్ట్స్ తెలుసా?'' అని సునీల్ అనడం టీజర్ లో ఫైనల్ పంచ్ గా ఉంచారు .. దాంతో ఇది అందరినీ హాయిగా నవ్వించేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)