ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విక్రమ్ కుమార్ తో నితిన్!

Sat, Jun 18, 2016
నితిన్
నితిన్
దర్శకుడు విక్రమ్ కుమార్ కి ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఎంతో క్రేజ్ వుంది. ఈ రెండు భాషలలోను ఆయన మంచి హిట్స్ ఇచ్చాడు. విక్రమ్ కుమార్ కథలో కొత్తదనం ఉంటుందని హీరోలు నమ్ముతారు. ఆయన సినిమాలు వైవిధ్యభరితంగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి ఆయన దర్శకత్వంలో మళ్లీ నటించడానికి నితిన్ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు.

ఆ మధ్య వరుస ఫ్లాపులతో వున్న నితిన్ కి 'ఇష్క్'తో సూపర్ హిట్ ఇచ్చింది విక్రమ్ కుమారే. తాజాగా ఆయన '24'తో సూర్యకి భారీ విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలోనే నితిన్ కూడా 'అ ఆ' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. కథా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులు వాళ్లకి వున్నాయి. అందువలన అవి పూర్తికాగానే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)