ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కడప కింగ్'గా పవన్?

Sat, Jun 18, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. రేపో మాపో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి 'హుషారు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. కానీ తాజాగా 'కడప కింగ్' అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఫిల్మ్ ఛాంబర్లో 'కడప కింగ్' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించాడు. పవన్ కల్యాణ్ తాజా చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కనుంది. దాంతో ఈ టైటిల్ పవన్ సినిమా కోసమేనని అంతా అనుకుంటున్నారు. పవన్ కి ఈ టైటిల్ నచ్చేసిందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)