ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో కాజల్ స్పెషల్ సాంగ్

Sat, Jun 18, 2016
కాజల్
కాజల్
ఇటీవల కాజల్ తెలుగులో నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' .. 'బ్రహ్మోత్సవం' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఇక ఇప్పట్లో తెలుగు తెరపై కాజల్ కనిపించడం కష్టమేనని అనుకున్నారు. కానీ పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ఆమె చరణ్ తో కలిసి సందడి చేయబోతోంది .. అదీ 'ధ్రువ' సినిమాలో. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

ఈ సినిమాలో చరణ్ కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ వుందట. ఆ సాంగ్ కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించి .. చివరికి కాజల్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. గతంలో 'మగధీర' .. 'గోవిందుడు అందరివాడేలే' వంటి సినిమాలను ఆమె చరణ్ తో కలిసి చేసింది. అందువలన చరణ్ సినిమా అనగానే ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. మొత్తానికి ఈ రకంగానైనా ఈ జంటను మరోసారి తెరపై చూడవచ్చన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)