ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గా శ్రీకాంత్!

Sat, Jun 18, 2016
శ్రీకాంత్
శ్రీకాంత్
సీనియర్ హీరోల్లో కొంతమంది విలన్ పాత్రలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నారు. అలా విలన్ పాత్రల వైపు టర్న్ అయిన జగపతిబాబు ఫుల్ బిజీ అయ్యాడు. విలన్ గాను విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన విలన్ రోల్ ఒకటి ఉందటే, ముందుగా జగపతిబాబునే సంప్రదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూడా విలన్ గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా శ్రీకాంత్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడని చెబుతున్నారు. అడపా దడపా హీరోగా చేస్తోన్న శ్రీకాంత్, ముఖ్యమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఒక తమిళ సినిమాలో విలన్ గా చేయడానికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. త్వరలో తెలుగులోనూ విలన్ పాత్రలు చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)