ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణా జిల్లాలో 'అ ఆ' జోరు!

Fri, Jun 17, 2016
'అ ఆ'లో నితిన్ - సమంతా
'అ ఆ'లో నితిన్ - సమంతా
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అ ఆ' సినిమా ఈ నెల 2న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటున సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఈ సినిమా మరింత జోరు చూపిస్తూ వెళుతోంది.

రెండు వారాల్లో ఈ సినిమా కృష్ణా జిల్లాలో 2 కోట్ల 5 లక్షల రూపాయలను రాబట్టింది. అదే ఉత్సాహంతో ఈ సినిమా మూడవ వారంలోకి ప్రవేశించింది. దాంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు. నితిన్ జోడీగా సమంతా .. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా, నితిన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెబుతున్నారు. కథ .. కథనం .. మాటలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చక్కని ఫీల్ తో ఈ ప్రేమకథను త్రివిక్రమ్ తెరకెక్కించిన విధానమే ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అదించిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)