ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాలతో మరోసారి ఎన్టీఆర్!

Fri, Jun 17, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ తనతో ఒకసారి సినిమా చేసిన దర్శక నిర్మాతలతో ఎంతో ఆత్మీయతను కలిగి ఉంటాడు. వాళ్లతో ఎప్పటికీ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందువల్లనే ఆయనతో ఒకసారి సినిమా చేసిన దర్శక నిర్మాతలు, ఆ తరువాత కూడా ఆయనతోనే కలిసి పనిచేస్తుంటారు. అలా కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ మరోసారి పనిచేయనున్నాడని చెబుతున్నారు.

కొరటాలతో ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల కథ .. కథనాలను సిద్ధం చేసుకున్న తీరు .. వాటిని చిత్రీకరిస్తోన్న విధానం .. ఆయన ప్లానింగ్ ఎన్టీఆర్ కి బాగా నచ్చాయట. ముఖ్యంగా కొరటాలతో ఆయనకి ఎంతో అనుబంధం ఏర్పడిందట. దాంతో ఆయనతో కలిసి మరోసారి పనిచేయాలని అనుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. వక్కంతం వంశీ .. పూరీ జగన్నాథ్ ల ప్రాజెక్టుల తరువాత, వీరి కాంబినేషన్ లో మరో సినిమా రావొచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)