ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయశాంతి మూవీలో కథ అదేనా?

Fri, Jun 17, 2016
విజయశాంతి
విజయశాంతి
నిన్నటి తరం కథానాయికగా విజయశాంతి తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగింది. అగ్రహీరోల సరసన వరుస విజయాలను అందుకోవడమే కాదు, కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్న నాయిక ఆమె. అలాంటి విజయశాంతి రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత దూరం ప్రయాణించింది. పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో, తిరిగి ఆమె సినిమాల పట్ల ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

'ఒసేయ్ రాములమ్మ' తరహా సినిమాను ఆమె స్వీయ నిర్మాణంలో తెరకెక్కించే అవకాశం ఉన్నట్టుగా ఆ మధ్య చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె మనసు మార్చుకుందట. తన సినీ .. రాజకీయ ప్రయాణాన్ని గురించిన విశేషాలతో ఆమె ఒక సినిమా చేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఈ విషయంపై ఒక ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరిపిందని కూడా చెబుతున్నారు. అదే నిజమైతే .. ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపాన్ని దాలుస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)