ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్షయ్ కుమార్ ఉత్సాహం!

Fri, Jun 17, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
బాలీవుడ్ కథానాయకులలో యాక్షన్ తో పాటు కామెడీని పండించగల హీరోగా అక్షయ్ కుమార్ కి ఎంతో క్రేజ్ వుంది. అలాంటి అక్షయ్ కుమార్ 'రోబో 2.0'లో రజనీతో తలపడే విలన్ గా నటిస్తున్నాడు. శంకర్ .. రజనీ సినిమా కనుక ఒప్పుకుని ఉంటాడని అనుకుంటే, ఇక ముందు కూడా సౌత్ సినిమాల్లో విలన్ పాత్రలను .. కీలకమైన ఇతర పాత్రలను పోషించడానికి తాను సిద్ధమని అక్షయ్ కుమార్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దక్షిణాది సినిమాల్లో ఆయన నటిస్తే అది ఆడియన్స్ కి విభిన్నంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆ సినిమాలను హిందీలోను విడుదల చేసుకోవచ్చు అనే ఆలోచనలో కొంతమంది దర్శక నిర్మాతలు వున్నారు. అయితే అక్షయ్ కుమార్ ను సంప్రదించాలని అనుకున్న వాళ్లు కాస్త ఆలోచనలో పడినట్టుగా సమాచారం. అందుకు కారణం భారీ మొత్తంలో ఆయన తీసుకునే పారితోషికం. ఇప్పుడు ఈ విషయమే అటు వైపు అడుగు పడకుండా దర్శక నిర్మాతలను ఆపుతోందట .. అదీ సంగతి!
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)