ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ నిర్మాణ సంస్థలతో మహేశ్ మూవీ!

Fri, Jun 17, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు - మురుగదాస్ కాంబినేషన్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కథాపరంగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ ఖర్చు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకూ ఉండవచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఇంత భారీ మొత్తం ఏ ఒక్కరో భరించడం కష్టం. అందువలన భారీ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తోంది.

ఎన్వీ ప్రసాద్ .. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ .. లియో ప్రొడక్షన్స్ .. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ రంగంలోకి దిగాయని అంటున్నారు. ఇక దర్శకుడు మురుగదాస్ సొంత బ్యానర్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ .. మహేశ్ సొంత బ్యానర్ ఎం.బి.ఎంటర్టైన్ మెంట్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాల్పంచుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఇలా ఆరు నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండటమనేది హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)