ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడు

Fri, Jun 17, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
మొదటి నుంచి కూడా కథల ఎంపిక విషయంలో సాయిధరమ్ తేజ్ జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నాడు. మాస్ ఆడియన్స్ .. యూత్ ఆశించే కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. రీసెంట్ గా 'సుప్రీమ్'తో హిట్ కొట్టిన ఆయన, 'తిక్క' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో వున్నాడు. అలాగే గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు.

అయితే స్క్రిప్టు విషయంలో అక్కడక్కడా కొన్ని మార్పులను సూచించాడట. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఆ మార్పులను చేసి వినిపించడంతో, తాను ఆశించిన స్థాయిలో వచ్చిందని సాయిధరమ్ తేజ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇప్పటివరకూ ఈ విషయం కారణంగానే ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా, ఇక సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పుకుంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)