ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే దారిలో వెళుతోన్న ఎన్టీఆర్!

Fri, Jun 17, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తమిళనాట రజనీకాంత్ కి గల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి కూడా ఆయన అభిమానులను ఎక్కువగా కలుస్తూ .. వాళ్లలో తనపట్ల గల అభిమానాన్ని మరింత పెంచుకుంటూ వచ్చారు. ఆ తరువాత అజిత్ .. విజయ్ కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, ఫ్యాన్స్ కి చిరంజీవి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచకుండా ఉండటమే కాకుండా, స్వయంగా వాళ్లతో ఆయన సమావేశమైన సందర్భాలు వున్నాయి. ఇక ఇటీవలే బన్నీ కూడా ఫ్యాన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన కోసం 'జనతా గ్యారేజ్' సెట్ కి వచ్చిన అభిమానులను ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నాడు .. వాళ్లతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)