ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లింగుస్వామితోనే బన్నీ!

Fri, Jun 17, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
'సరైనోడు' సినిమా సాధించిన వసూళ్లతో బన్నీ చాలా హ్యాపీగా వున్నాడు. ఈ ఉత్సాహంతో ఆయన విక్రమ్ కుమార్ తోను .. లింగుస్వామితోను సినిమాలు మొదలుపెట్టనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి దర్శకులలో ఎవరితో ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో లింగుస్వామి తోనే బన్నీ ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తి చేసి, సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)