ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చేనెలలో సెట్స్ పైకి పవన్

Fri, Jun 17, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెల మొదటి వారం నుంచి షూటింగులో పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్టు చెబుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి సమయాన్ని వృథా చేయకుండా చూడాలని పవన్ భావిస్తున్నాడట.

ఈ సినిమా షూటింగును నవంబర్ నాటికి పూర్తిచేయాలనేది ఆయన ఆలోచన. ఆ వెంటనే ఆయన త్రివిక్రమ్ సినిమా చేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవన్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన ఈ సినిమా కోసం ఆయన కాస్త బరువు పెరిగినట్టు చెబుతున్నారు. పవన్ జోడీగా శ్రుతిహాసన్ నటించనున్న ఈ సినిమా విశేషాల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)