ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Jun 17, 2016
'మొహంజదారో'లో పూజా హెగ్డే
'మొహంజదారో'లో పూజా హెగ్డే
* 'ముకుంద', 'ఒక లైలా కోసం' వంటి తెలుగు సినిమాలలో నటించిన కథానాయిక పూజా హెగ్డే తాజాగా 'మొహంజదారో' అనే హిందీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని పూజా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ లుక్కులో పూజా అందం అందర్నీ ఆకట్టుకుంటోంది.
* తమిళ నటుడు విజయకాంత్ గతంలో నటించిన 'పెరసు' చిత్రాన్ని తెలుగులోకి 'కాశీ విశ్వనాథ్' పేరిట డబ్ చేశారు. ఈ నెల 24న ఈ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. విజయకాంత్ పోలీసాఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
* శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తాడు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)