ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగశౌర్య కాస్త కంగారు పడ్డాడట!

Thu, Jun 16, 2016
'ఒక మనసు'లో నిహారిక - నాగశౌర్య
'ఒక మనసు'లో నిహారిక - నాగశౌర్య
ప్రేమకథలను గురించి ఆలోచించే రచయితలకు .. ఆ కథలను తెరకెక్కించాలని అనుకునే దర్శకులకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో నాగశౌర్య. ప్రేమకథా చిత్రాల నాయకుడిగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగశౌర్య, 'ఒక మనసు' అనే మరో లవ్ స్టోరీతో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను పోషించిన సూర్య పాత్రకి మంచి పేరు రావడం ఖాయమని చెప్పాడు. నిహారిక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుక, ఆమెతో నటించాలనుకునే సరికి కాస్త కంగారుగా అనిపించిందని అన్నాడు. కానీ ఆమె చాలా కలుపుగోలుగా .. సరదాగా ఉండటంతో ఇబ్బంది పడలేదని చెప్పాడు. ఈ సినిమా కథను .. పాత్రలను రామరాజు చాలా చక్కగా మలిచాడనీ, తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుందని స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)