ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంపత్ నంది దర్శకత్వంతో నితిన్!

Thu, Jun 16, 2016
నితిన్
నితిన్
'అ ఆ' తరువాత నితిన్ ఏ దర్శకుడితో కలిసి పనిచేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సంపత్ నంది పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'రచ్చ'తో చరణ్ ఫ్యాన్స్ ను .. 'బెంగాల్ టైగర్'తో రవితేజ అభిమానులను ఆకట్టుకున్న సంపత్ నంది, ఆ తదుపరి సినిమాను ఎవరితో చేయనున్నాడనే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు.

మళ్లీ చరణ్ తో చేయాలనుకున్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే రామ్ తో చేయాలనుకున్నా అదీ కుదరలేదు. ఈ నేపథ్యంలో నితిన్ కి ఆయన ఒక లైన్ వినిపించాడనీ, అది ఆయనకి నచ్చడంతో పూర్తి కథ రెడీ చేయమన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కథకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే, సంపత్ నందితో నితిన్ కలిసి పనిచేయడం ఖరారు అవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)