ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు సినిమాలపై ఇలియానా దృష్టి!

Thu, Jun 16, 2016
ఇలియానా
ఇలియానా
తెలుగు తెరపై నాజూకు సుందరిగా మెరిసి, యూత్ హృదయాలను పొలో మంటూ కొల్లగోట్టేసిన కథానాయిక ఇలియానా. కుర్రకారు కలల రాణిగా వెలుగొందిన ఇలియానా, ఇక్కడ అగ్రహీరోలతో జోడీకడుతూ భారీ విజయాలను సొంతం చేసుకుంది. అలాంటి ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టి, తెలుగు సినిమాలకి దూరమైంది.

తాజాగా ఒక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆమె, తెలుగు సినిమాల పట్ల తనకి గల ఆసక్తిని వ్యక్తం చేసింది. తాను బాలీవుడ్ వెళ్లిన తరువాత బిజీ అయ్యాననీ, అందువలన టాలీవుడ్ నుంచి తనకి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అంది. హైదరాబాద్ అన్నా .. తెలుగు ప్రేక్షకులన్నా తనకి ఎంతో ఇష్టమని చెప్పింది. మంచి అవకాశాలు వస్తే తెలుగులో చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ఆశాజనకంగా లేకపోవడంతో టాలీవుడ్ కి వచ్చేద్దామని అనుకుంటోన్న ఇలియానాకి, అంత త్వరగా ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)