ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెరపైకి హీరోయిన్ సోదరుడు

Thu, Jun 16, 2016
'అభినేత్రి'లో ప్రభుదేవా - తమన్నా
'అభినేత్రి'లో ప్రభుదేవా - తమన్నా
సినిమా పరిశ్రమలో ఒకరు క్లిక్ అయితే .. ఆ కుటుంబం నుంచి మరికొందరు రంగంలోకి దిగడం జరుగుతూ వుంటుంది. అలా కథానాయకులు .. కథానాయికల కుటుంబాల నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన వాళ్లు ఎంతోమంది వున్నారు. తాజాగా ఆ జాబితాలోకి అమలా పాల్ తమ్ముడు 'అభిజిత్ పాల్' కూడా చేరిపోయాడు.

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె ఎ.ఎల్.విజయ్ ను వివాహం చేసుకుని, ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా అమలాపాల్ తమ్ముడు అభిజిత్ పాల్ తెరకి పరిచయం అవుతున్నాడు. ఆయన ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో, టైటిల్ రోల్ ను తమన్నా పోషిస్తుండగా .. ప్రభుదేవా .. సోనూ సూద్ ప్రధానమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో అభిజిత్ పాల్ మరిన్ని ఛాన్సులు రాబట్టుకుంటాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)