ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ నెల 29న సెట్స్ పైకి నాగార్జున

Thu, Jun 16, 2016
నాగార్జున
నాగార్జున
నాగార్జున కథానాయకుడిగా మరో భక్తి చిత్రం రూపొందుతోంది .. ఆ సినిమా పేరే 'ఓం నమో వేంకటేశాయ'. గతంలో నాగార్జునతో అన్నమయ్య .. శ్రీరామదాసు .. శిరిడీసాయి వంటి చిత్రాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమలలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్వామిని ప్రత్యక్షంగా సేవించిన 'హథీరామ్ బావాజీ' జీవితచరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన పాత్రలకి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా పూర్తికావడంతో, ఈ నెల 29న ఈ సినిమా షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ రోజున సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే అంటున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన 4 పాటల రికార్డింగును పూర్తిచేశారు. హిట్ కాంబినేషన్లో తయరవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)