ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ భామ

Thu, Jun 16, 2016
పరిణీతి చోప్రా
పరిణీతి చోప్రా
కొంతమంది తారల్లో డెడికేషన్ బాగా కనిపిస్తుంది. తాము చేయబోయే పాత్ర కోసం ముందుగానే కసరత్తు చేస్తారు. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కూడా ఆ జాబితాలోకి వస్తుంది. మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. 80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా పరిణీతి నటిస్తోంది. దీంతో ఈ చిన్నది ప్రస్తుతం తెలుగు భాషపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ భాషలోని వాడుక పదాలు అవీ తెలిస్తే సెట్లో ఇతర ఆర్టిస్టులతో కలవడం ఈజీ అవడమే కాకుండా, తన నటనకు కూడా ఉపయోగపడుతుందని భావించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ట్యూటర్ ను పెట్టుకుని తెలుగు నేర్చుకుంటున్నట్టు సమాచారం. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రం కోసం పరిణీతి 3 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)