ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గల్ఫ్ లోను 'బాబు బంగారం'

Wed, Jun 15, 2016
'బాబు బంగారం'లో వెంకటేశ్ - నయనతార
'బాబు బంగారం'లో వెంకటేశ్ - నయనతార
వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన 'బాబు బంగారం' సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించడం వలన .. హిట్ పెయిర్ అనిపించుకున్న వెంకటేశ్ - నయనతార కలిసి నటించడం వలన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని అంటున్నారు.

దాదాపు 30 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వినికిడి. ఇక మొదటిసారిగా గల్ఫ్ లోను 50కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. వెంకటేశ్ మార్క్ కామెడీతో రూపొందిన ఈ సినిమా, ఆయనకి మరో సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)