ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కి విలన్ గా అజయ్?

Wed, Jun 15, 2016
అజయ్
అజయ్
తెలుగు తెరపై విలన్ గా మెప్పించిన అజయ్, ఆ తరువాత కాలంలో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. మొదట్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వచ్చిన ఆయన, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశాడు. 'దిక్కులు చూడకు రామయ్య' .. ' ఇష్క్' వంటి చిత్రాలు నటుడిగా ఆయనకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాంటి అజయ్ మళ్లీ విలన్ గా .. అదీ పవన్ మూవీలో కనిపించనున్నాడనే టాక్ ఫిలిం నగర్లో షికారు చేస్తోంది.

ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ చేయనున్న మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. గతంలో పవన్ కాంబినేషన్లో ఖుషి .. గబ్బర్ సింగ్ సినిమాల్లో అజయ్ నటించాడు. ఇక ఇటీవల '24' .. ' అ ఆ' సినిమాల్లోను ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అజయ్ కి పవన్ మూవీలో విలన్ పాత్ర లభించడం నిజమే అయితే, ఆయనకి ఆ పాత్ర మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)