ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' రిలీజ్ మరికాస్త ఆలస్యం!

Wed, Jun 15, 2016
'కబాలి' లో రజనీకాంత్ - రాధికా ఆప్టే
'కబాలి' లో రజనీకాంత్ - రాధికా ఆప్టే
'కబాలి' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? .. సంచలన విజయానికి ఎప్పుడు తెరతీస్తుందా? అని రజనీ అభిమానులు ఆశగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జూలై 1న విడుదల చేస్తున్నట్టుగా ఈ సినిమా టీమ్ ప్రకటించింది. దాంతో విడుదల తేదీ దగ్గర పడుతోందని ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చినట్టుగా తెలుస్తోంది. జూలై 1 న కాకుండా జూలై 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా నిర్మాత కళైపులి థాను చెప్పారు. ఈ రోజు నుంచే తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలవుతుందట. డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన వ్యవహారం కారణంగానే, ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఇది రజనీ ఫ్యాన్స్ ను నిరాశపరిచే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)