ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జూలైలో రానున్న 'సెల్ఫీ రాజా'

Wed, Jun 15, 2016
అల్లరి నరేశ్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందువల్లనే కాస్త ఆలస్యమే అయినా, ఆయన మంచి కథను ఎంచుకున్నాడు. ఈశ్వర్ రెడ్డి సిద్ధం చేసిన ఆ కథ పేరే 'సెల్ఫీ రాజా'. అల్లరి నరేష్ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించేదేవిటో ఆయనకి బాగా తెలుసు. గతంలో ఆయన తెరకెక్కించిన 'సిద్ధూ ఫ్రమ్ సికాకుళం' సినిమానే అందుకు నిదర్శనం.

అలాగే ఈ సినిమాను కూడా ఆయన పూర్తి వినోదాత్మకంగా మలిచాడు. ఈ సినిమాలో నరేశ్ అదేపనిగా సెల్ఫీలు తీసుకునే అలవాటుతో కామెడీ పండించనున్నాడు. నరేశ్ జోడీగా సాక్షి చౌదరి .. కామ్నా రానావత్ నటించారు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలైలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్టులుక్ కీ .. ఫస్టు టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, సినిమా సక్సెస్ పై ఆశాభావంతో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)