ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హారర్ కథకి రెడీ అవుతోన్న నయన్

Tue, Jun 14, 2016
నయనతార
నయనతార
తమిళనాట నయనతార వరుస విజయాలతో దూసుకుపోతోంది. అగ్రకథానాయకుల జోడీ కడుతూనే, కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వెళుతోంది. ఈ క్రమంలో 'మాయ' (మయూరి) తరువాత ఆమె మరో హారర్ చేయడానికి రెడీ అవుతోంది. మాయ సినిమా హిట్ అయ్యాక ఆమెకి చాలా మంది హారర్ కథలు వినిపించారు.

కానీ వైవిధ్యభరితంగా అనిపించడంతో, దర్శకుడు రామస్వామికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో, నయనతార పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన అన్నాడు. ఈ నెల 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరించడం జరుగుతుందనీ, అలాగే ఒకేసారి రెండు భాషలలోను విడుదల చేస్తామని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)