ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తేజకి థ్యాంక్స్ చెప్పిన నితిన్

Tue, Jun 14, 2016
నితిన్
నితిన్
తెలుగు తెరపై ఓ అందమైన ప్రేమకథను ఆవిష్కరించాలనుకునే దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తుకు వచ్చే అందమైన హీరో నితిన్. యువకథానాయకుల మధ్య గట్టి పోటీ వున్నా, ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. అలాంటి నితిన్, తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. 2002 జూన్ 14న రిలీజైన ఈ సినిమా, కొత్త ట్రెండ్ కి తెరతీసింది. ఈ తరహాలో మరెన్నో ప్రేమ కథలు తెరపైకి రావడానికి కారణమైంది.

ఈ సినిమా తరువాత దిల్ .. సై వంటి సూపర్ హిట్లను నితిన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత వరుస పరాజయాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి, ఇష్క్ .. గుండెజారి గల్లంతయ్యిందే .. అ ఆ వంటి ఘన విజయాలను అందుకున్నాడు. తనని తెలుగు తెరకి పరిచయం చేసి, ఈ రోజున తాను ఈ స్థానంలో ఉండటానికి కారణమైన తేజకి నితిన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే తనని ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)