ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

20 నుంచి 'శాతకర్ణి' 3వ షెడ్యూల్

Tue, Jun 14, 2016
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. మొదటి షెడ్యూల్ 'మొరాకో'లోను .. రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లోను జరిగింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను పోరాట సన్నివేశాలనే తెరకెక్కించారు. ఇక ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇక్కడి చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఒక భారీ 'ఓడ' సెట్ వేసి అందులో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యుద్ధ సన్నివేశాలకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయి. అందువలన ముందుగా ఈ సన్నివేశాలను చిత్రీకరించి గ్రాఫిక్స్ టీమ్ కి అందించే ఉద్దేశంతో, క్రిష్ వరుసగా పోరాట దృశ్యాలనే చిత్రీకరిస్తూ వెళుతున్నాడు. ఈ సినిమాలో రాజమాతగా హేమమాలిని నటించనుండగా .. మహారాణి పాత్రలో శ్రియ కనిపించనుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)