ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2' సెట్లో ప్రియమణి!

Tue, Jun 14, 2016
ప్రియమణి
ప్రియమణి
అభిమానుల నిరీక్షణ ఫలించేలా చేస్తూ .. వాళ్లకి ఆనందాన్ని కలిగిస్తూ 'బాహుబలి 2' షూటింగ్ మొదలైంది. నిన్న హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో పోరాట దృశ్యాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేజర్ షెడ్యూల్లో తొలి రోజున ఈ సినిమా సెట్ లో ప్రియమణి కనిపించింది. షూటింగ్ చూడటానికి వెళ్ళాననీ .. చాలా బాగా జరుగుతోందనీ .. తనని అనుమతించినందుకు ధన్యవాదాలు అని ప్రియమణి ట్వీట్ చేసింది.

చెన్నై నుంచి షూటింగ్ చూడటానికి ప్రియమణి ఎందుకు వస్తుంది? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రియమణి 'యమదొంగ' సినిమా చేసింది. ఇప్పుడు కూడా 'బాహుబలి 2'లో ప్రియమణికి రాజమౌళి ఏదో పాత్రను ఆఫర్ చేసి ఉంటాడనీ, ఆ విషయాలు మాట్లాడటానికే ఆమె అక్కడికి వచ్చి ఉంటుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో ఏమో!
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)