ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ వీరాభిమానిగా నాని!

Tue, Jun 14, 2016
నాని
నాని
తెలుగు తెరపై విభిన్నమైన చిత్రాల ద్వారా అలరిస్తోన్న యువ కథానాయకులలో నాని ఒకరు. యూత్ కి కనెక్ట్ అయ్యే కథాబలమున్న సినిమాలను ఎంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనని వరుస విజయాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని త్వరలో చేయనున్న ఒక సినిమాలో పవన్ అభిమానిగా కనిపించనున్నాడు.

'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నాని కనిపించాడు. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాగానే చూశారు. అలాగే పవన్ ఫ్యాన్స్ లోను ఆసక్తిని రేకె త్తించాలని అనుకున్నాడో ఏమో గానీ, విరించి వర్మ దర్శకత్వం వహించే సినిమాలో ఆయన పవన్ వీరాభిమానిగా నటించనున్నాడు. ప్రస్తుతం నాని తన తాజా చిత్రం 'జెంటిల్ మెన్' ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. ఆ వెంటనే విరించి వర్మతో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)