ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ బాబు మరిన్ని జాగ్రత్తలు!

Tue, Jun 14, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
పూరీ జగన్నాథ్ త్వరలో తాను మహేశ్ బాబుతో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పాడు. ఆ తరువాత ఆ సినిమా టైటిల్ 'జన గణ మన' అని ఎనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ' పోకిరి' రావడం వలన, ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మురుగదాస్ సినిమా తరువాత పూరీ సినిమానే మహేశ్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహేశ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో పూరీ తెరకెక్కించే సినిమా ఫలితంపైనే ఆయన దర్శకత్వంలో మహేశ్ చేస్తాడా .. లేదా అనేది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇక ఒక వేళ ఈ సినిమా హిట్ అయినా .. 'జన గణ మన' సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తిగా .. పక్కాగా సిద్ధమైన తరువాతనే ఓకే చెప్పాలనే ఆలోచనలో మహేశ్ ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 'బ్రహ్మోత్సవం' పరాజయం కారణంగానే మహేశ్ ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)