ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు మాట్లాడేస్తున్న మలయాళ నటుడు!

Tue, Jun 14, 2016
మోహన్ లాల్
మోహన్ లాల్
మలయాళ మహా నటుడిగా మోహన్ లాల్ కి ఎంతో క్రేజ్ వుంది. మలయాళంలో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఆయన ఫుల్ బిజీగా వుండేవారు. అలాంటి మోహన్ లాల్ ఇటీవల కాలంలో తెలుగు సినిమాలపై బాగానే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకి రెండు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తోన్న 'మనమంతా' ఒకటి కాగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న 'జనతా గ్యారేజ్' మరొకటి.

ఈ రెండు సినిమాల్లోనూ ఆయన కీలకమైన పాత్రలనే పోషిస్తున్నారు. ఈ సినిమాల్లో అవకాశం రావడమే ఆలస్యం ఆయన తెలుగు భాషపై దృష్టి పెట్టారు. అప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారట. అందువలన ఈ రెండు సినిమాల్లోనూ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నారని అంటున్నారు. మోహన్ లాల్ ఇంతటి గొప్ప నటుడు కావడానికి ఆయనలోని ఈ పట్టుదలే కారణమని అంతా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)