ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజమౌళితో ఎన్టీఆర్ మూవీ!

Tue, Jun 14, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఒకవైపున 'బాహుబలి 2' సినిమా షూటింగుతో రాజమౌళి .. మరో వైపున 'జనతా గ్యారేజ్' పనిలో ఎన్టీఆర్ బిజీబిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందడానికి సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి .. ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెంబర్ వన్' .. 'సింహాద్రి' .. 'యమదొంగ' సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ క్రేజ్ ను ఈ సినిమాలు అమాంతంగా పెంచేశాయి.

ఆ తరువాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయ్యారు. అయితే 'బాహుబలి 2' తరువాత మాత్రం ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నారని అనుకుంటున్నారు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం విజయేంద్రప్రసాద్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. చూడాలి మరి .. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)