ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కట్టప్ప 'దొర' వచ్చేస్తున్నాడు

Mon, Jun 13, 2016
'దొర' లో బిందుమాధవి- శిబిరాజ్
'దొర' లో బిందుమాధవి- శిబిరాజ్
ఇటీవల కాలంలో తెలుగులో సత్యరాజ్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందువల్లనే ఆయన నటించిన తమిళ మూవీ 'జాక్సన్ దొరై', తెలుగులో 'దొర' పేరుతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమాలో ఆయన కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన తనయుడు శిబిరాజ్ హీరోగా నటించగా, బిందుమాధవి కథానాయికగా అలరించనుంది.

హారర్ కథాంశంతో ధరణీ ధరన్ తెరకెక్కించిన ఈ సినిమాపై శిబిరాజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో హారర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోను సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అందువలన ఈ సినిమా తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆడియో వేడుకను ఈ నెల 21న నిర్వహించి, సినిమాను జూలై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో తనకి తెలుగులోను మళ్లీ ఛాన్సులు రావొచ్చనే ఆశతో బిందుమాధవి వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)