ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగాస్టార్ కాంప్లిమెంట్ గురించి మారుతి!

Mon, Jun 13, 2016
చిరంజీవి
చిరంజీవి
మారుతి దర్శకత్వం వహించిన 'బాబు బంగారం' విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ఇటు ఆడియన్స్ నుంచి అటు సినీ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ టీజర్ చిరంజీవికి కూడా బాగా నచ్చేసిందట. టీజర్ చాలా బాగుందంటూ ఆయన మారుతిని అభినందించాడట.

మెగాస్టార్ ప్రశంసలు ఎంతో ఆనందాన్ని కలిగించాయనీ, మరెంతో కిక్ ను ఇచ్చాయని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. వెంకటేశ్ - నయనతార జంటగా ఈ సినిమాను పూర్తి వినోదభరితంగా మారుతి మలిచినట్టు చెబుతున్నారు. జూలై 23న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇటు మారుతి 'భలే భలే మగాడివోయ్' హిట్ ఇచ్చి ఉండటం వలన, అటు వెంకటేశ్ - నయనతారలది సూపర్ హిట్ కాంబినేషన్ కావడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)