ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళలో 'సింగం 3' క్రేజ్

Mon, Jun 13, 2016
సూర్య
సూర్య
కోలీవుడ్లో విభిన్నమైన చిత్రాలకు .. విలక్షణమైన పాత్రలకి సూర్య కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. కొత్త కథలను సిద్ధం చేసుకుంటూ .. సొంత నిర్మాణ సంస్థలో వరుస సినిమాలు చేస్తూ ఆయన ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'సింగం 3' సినిమా చేస్తున్నాడు. హరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ జరుపుకుంది.

సూర్యకి గల క్రేజ్ దృష్ట్యా కేరళకి చెందిన ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా హక్కులను 3.5 కోట్లకి కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. సూర్య '24' సినిమా కేరళలో 10 కోట్లవరకూ రాబట్టింది. ఆ సినిమా ప్రభావం ఈ సినిమా బిజినెస్ పై పడిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గతంలో సూర్య చేసిన సింగం1 .. సింగం2 ఘన విజయాలను అందుకున్నాయి. అలాగే అనుష్క .. శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించడం కూడా ఈ సినిమా ఈ స్థాయి రేటుకి అమ్ముడుకావడానికి కారణమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)