ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షరతు పెడుతోన్న కథానాయిక!

Mon, Jun 13, 2016
ఆనంది
ఆనంది
తెలుగులో 'బస్టాప్' సినిమాలో మెరిసిన ఆనంది, ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో కనిపించింది. అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కావడం వలన, పెద్దగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళ సినిమాలకి ప్రాధాన్యతని ఇచ్చింది. అక్కడ అందాల కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కుర్ర హీరోలతో కలిసి హిట్స్ కూడా కొట్టింది.

అలాంటి ఆనంది ఇకపై కురచ దుస్తులు ధరించనంటూ ఓ షరతు పెడుతోంది. గ్లామర్ పేరుతో కురచ దుస్తులు ధరించడం తనకి ఇష్టం ఉండదనీ, గతంలో కొన్ని సినిమాలకిగాను ఈ విషయంలో ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఈ కారణంగా తాను సినిమాలు వదులుకోవడానికి సిద్ధపడిన సందర్భాలు వున్నాయని అంది. అందుకే తాను పొట్టి డ్రెస్ లు వేయనని ముందుగానే దర్శక నిర్మాతలకి స్పష్టం చేస్తున్నానని అంది. అప్పటి నుంచి మంచి పాత్రలు వస్తున్నాయనీ, తాజాగా తాను చేసిన 'ఇనక్కు ఇన్నోరు పర్ ఇరుక్కు' మంచి పేరు తీసుకురావడం ఖాయమనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)