ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శాతకర్ణి'లో ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియ!

Mon, Jun 13, 2016
క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ దశలో వుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ -హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో జరిగింది. ఇక్కడ వేసిన భారీ సెట్లో పోరాట దృశ్యాలను చిత్రీకరించారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ వార్ సీన్స్ లో పాల్గొన్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఈ సీన్ కూడా ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

త్వరలో ఈ సినిమా షూటింగులో శ్రియ జాయిన్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా మహారాణి పాత్రలో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె కనిపించనుంది. ఈ సినిమా కోసం ముందుగా నయనతారను అనుకున్నప్పటికీ కుదరలేదు. ఆ తరువాత అనుష్క .. పూజా హెగ్డే .. వేదికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఇక ఈ పాత్రకి శ్రియ అయితేనే బాగా నప్పుతుందని భావించిన ఈ సినిమా టీమ్, ఆమెను ఎంపిక చేసింది. బాలకృష్ణ 100వ సినిమా కావడం వలన, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విశేషం ప్రత్యేకతను సంతరించుకుంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)