ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ధ్రువ' విలన్ కు చరణ్ కాంప్లిమెంట్స్!

Mon, Jun 13, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుని, మూడవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ మేజర్ షెడ్యూల్ ను కాశ్మీర్ లో ప్లాన్ చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన అవుట్ పుట్ ను చరణ్ చూశాడట. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, దర్శకుడు సురేందర్ రెడ్డిని అభినందించాడు.

అంతే కాకుండా అరవింద్ స్వామి నటన అద్భుతమని ఆయనని ప్రశంసించాడు. విలన్ పాత్రలో అరవింద్ స్వామి పూర్తిగా ఇమిడిపోయారనీ .. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు. ఇంత గొప్ప నటుడితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుందని అన్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన జోడీగా రకుల్ కనువిందు చేయనుంది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)