ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షకీలా పాత్రలో బాలీవుడ్ భామ!

Mon, Jun 13, 2016
హ్యూమా ఖురేషి
హ్యూమా ఖురేషి
ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన శృంగారతార సిల్క్ స్మిత జీవితకథ 'డర్టీ పిక్చర్' పేరిట తెరకెక్కడం, అది ఘనవిజయం సాధించడం మనకు తెలుసు. ఈ క్రమంలో మరో శృంగారతార షకీలా కథ కూడా దృశ్యరూపాన్ని సంతరించుకోనుంది. నెల్లూరుకు చెందిన షకీలా మలయాళంలో ఒకప్పుడు బిజీ శృంగారతార. అక్కడ ఆమె సినిమా రిలీజవుతోందంటే, పెద్ద హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. అంతలా ఆమె బాక్సాఫీసును షేక్ చేసింది.
అలాంటి షకీలా జీవితంలో వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఆటుపోటులున్నాయి. ఇప్పుడీ కథను వెండితెరకు ఎక్కించడానికి కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో షకీలా పాత్రకు బాలీవుడ్ శృంగారతార హ్యూమా ఖురేషి ఎంపికైనట్టు తెలుస్తోంది. మరి, 'డర్టీ పిక్చర్'లా షకీలా కథ కూడా సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)