ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెంకీ కోసం స్పెషల్ క్యారెక్టర్!

Sun, Jun 12, 2016
వెంకటేశ్
వెంకటేశ్
ప్రస్తుతం 'బాబు బంగారం' సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ త్వరలో ఒక సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వుందని అంటున్నారు. ఇటీవల 'సరైనోడు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ వుందట. దీనిని వెంకటేశ్ చేస్తే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ధీమాతోనే ఆయన వెంకటేశ్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి, వెంకీ దీనికి ఓకే చెబుతాడేమో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)