ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగులోకి మరాఠీ సూపర్ హిట్!

Sun, Jun 12, 2016
'సైరత్'లో ఓ దృశ్యం
'సైరత్'లో ఓ దృశ్యం
ఇటీవలి కాలంలో మరాఠీలో సూపర్ హిట్టయిన 'సైరత్' చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరాఠీ వెర్షన్ నిర్మాతలతో కలసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దీనిని ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ రీమేక్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగినట్టు వార్తలొస్తున్నాయి. మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగరాజ్ మంజులే ఈ రీమేక్స్ కి కూడా దర్శకత్వం వహిస్తాడు. అయితే, తెలుగు వెర్షన్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. కేవలం 4 కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ మరాఠీ చిత్రం సుమారు 85 కోట్లు వసూలు చేసి అక్కడ పెద్ద సంచలనం సృష్టించింది!
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)