ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దిల్ రాజుకి 'జనతా గ్యారేజ్' నైజామ్ రైట్స్

Sun, Jun 12, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజామ్ ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన భారీ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది.

దిల్ రాజుకి మంచి పరిశీలనా శక్తి వుంది. ఆయన రైట్స్ తీసుకున్నాడు అంటే .. దాదాపు ఆ సినిమా విజయం సాధిస్తుందని మిగతా వారు భావిస్తుంటారు. ఆయన రైట్స్ తీసుకోవడం వలన సహజంగానే ఆ సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుంది. అలాంటి క్రేజ్ ఇప్పుడు 'జనతా గ్యారేజ్' విషయంలోను కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)