ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ కంటే అక్షయ్ పారితోషికమే ఎక్కువట!

Sun, Jun 12, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
వెండితెరపై తిరుగులేని కథానాయకుడు రజనీకాంత్. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఆయనకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతాయి కనుక, ఆయన తీసుకునే పారితోషికం కూడా ఒక రేంజ్ లోనే వుంటుంది. ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'రోబో 2.0' సినిమాకి గల పారితోషికం కూడా భారీగానే వుంటుంది.

అలాంటిది ఈ సినిమాకి గాను ఆయనకంటే అక్షయ్ కుమార్ పారితోషికం ఎక్కువనే టాక్ వినిపిస్తోంది. తనకున్న క్రేజ్ ను బట్టి అక్షయ్ కుమార్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడట. బాలీవుడ్ బిజినెస్ మొత్తం ఆయనపై ఆధారపడి వుంది కనుక,ఆయనకి అధిక మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని తెలుస్తోంది. అలా ఆయన అందుకునే పారితోషికం రజనీ కంటే ఎక్కువని అంటున్నారు. ఒక సినిమాలో హీరో కంటే విలన్ ఎక్కువ పారితోషికం అందుకోవడం విశేషంగా అనిపిస్తోంది కదూ.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)