ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2' క్లైమాక్స్ ఖర్చు 30 కోట్లు!

Sun, Jun 12, 2016
ఇప్పుడు కేవలం టాలీవుడ్ నే కాక, బాలీవుడ్ ని కూడా తన వైపుకు తిప్పుకున్న చిత్రం 'బాహుబలి 2'. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ సీక్వెల్ పై పడింది. దానికి తోడు దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో తెరకెక్కిస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణకు 30 కోట్లు వెచ్చిస్తున్నారట. రేపటి (సోమవారం) నుంచి హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో సుమారు 70 రోజుల పాటు ఈ చిత్రీకరణ భారీ ఎత్తున జరుగుతుంది. అప్పట్లో 'బాహుబలి' క్లైమాక్స్ చిత్రీకరణకు 10 కోట్లు ఖర్చు పెడితేనే అదొక సెన్సేషన్ అయింది. అలాంటిది ఇప్పుడు దీనికి 30 కోట్లు పెడుతుండడంతో, ఇది మరింత సంచలన వార్తగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)