ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్లామర్ డోస్ పెంచేసిన నయనతార

Sat, Jun 11, 2016
నయనతార
నయనతార
నయనతార తన కెరియర్ ఆరంభంలో ఒక రేంజ్ లో అందాలను ఆరబోసింది. అలా కుర్రకారు కలల రాణిగా ఆమె మార్కులు కొట్టేసింది. అలాంటి నయనతార ఆ తరువాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె గ్లామర్ ను ఒలకబోసే అవకాశం పెద్దగా రాలేదు. కానీ 'ఇరుముగన్' సినిమాలో మాత్రం ఆమె గ్లామర్ డోస్ పెంచేసిందనే టాక్ కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది.

విక్రమ్ కథానాయకుడిగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయన్ బికినీ వేసిందనీ .. విక్రమ్ తో ఘాటైన లిప్ లాక్ వుందని చెప్పుకుంటున్నారు. చాలాకాలం తరువాత నయనతార ఇలా గ్లామర్ తో మెరవడానికి ఉత్సాహాన్ని చూపించడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)