ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఓ ఇంటివాడు కాబోతోన్న క్రిష్

Sat, Jun 11, 2016
క్రిష్
క్రిష్
వరుస విజయాలను సాధిస్తూ కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోతోన్న కొంతమంది దర్శకులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అలా విక్రమ్ కుమార్ వివాహం 'శ్రీనిధి'తో ఈ సెప్టెంబర్లో జరగనుంది. ఎ.ఆర్.రెహ్మాన్ టీమ్ లో ఆమె సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఇక దర్శకుడు క్రిష్ కూడా పెళ్లికొడుకు కాబోతున్నాడనే వార్త ఒకటి షికారు చేస్తోంది. ఆయనకి కాబోయే భార్య పేరు రమ్య అనీ .. ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తోంది.

పెళ్లికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయనీ, ఆగస్టులో ఈ వేడుక జరగవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, మూడవ షెడ్యూల్ కి ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిష్ కెరియర్ లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)