ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా ఆ మూవీ వదులుకున్నాడా?

Sat, Jun 11, 2016
రానా
రానా
ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో రానా బిజీబిజీగా వున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సూపర్ హిట్ అనిపించుకున్న ఒక సినిమాను ఆయన వదులుకున్నాడనే టాక్ వినిపిస్తోంది .. ఆ సినిమాయే 'బిచ్చగాడు'. ఇటీవల తమిళంలో 'పిచ్చై కారన్' పేరుతో రూపొందిన ఓ సినిమా, 'బిచ్చగాడు' పేరుతో తెలుగులోకి అనువదించబడింది. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించాడు.

తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాకి నిర్మాత కూడా అయిన విజయ్ ఆంటోని, తెలుగులో రానాతో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించాడు. అనుకున్న వెంటనే రానాను సంప్రదించి కథ వినిపించాడు కూడా. అయితే ఎందుకో ఈ కథ పట్ల రానా అంతగా ఆసక్తి చూపలేదట. ఈ నేపథ్యంలో ఈ సినిమాను విజయ్ ఆంటోని తెలుగులోకి అనువదించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా, ఇక్కడ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా మన్ననలు అందుకుంది. దాంతో ఈ సినిమా రీమేక్ కి రానా ఓకే చెప్పి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)