ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ డ్యాన్స్ కి థ్రిల్లయిన నితిన్!

Fri, Jun 10, 2016
నితిన్
నితిన్
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ సెట్లో ఈ రోజు ఎన్టీఆర్ ... సమంతాలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో నితిన్ అక్కడికి వెళ్లాడు. 'జనతా గ్యారేజ్' టీమ్ ను ఆప్యాయంగా పలకరించాడు. ఎన్టీఆర్ ను చూడక చాలా రోజులైందనీ .. ఆయనని కలుసుకోవడం కోసమే సెట్ కి వెళ్లానని నితిన్ చెప్పాడు.

సెట్లో వుండి ఎన్టీఆర్ డాన్స్ చూడటం థ్రిల్లింగా అనిపించిందని అన్నాడు. 'అ ఆ' హిట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఆయన ఎన్టీఆర్ తోను .. కొరటాలతోను పంచుకున్నాడట. ఒక వైపున ఎన్టీఆర్ వరుస హిట్స్ తో వున్నాడు. మరో వైపున కొరటాల కూడా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' బంపర్ హిట్ కావడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)